వేశ్య పాత్రలో శ్రద్దా దాస్

Published on Feb 20,2020 11:06 PM

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోదామని వచ్చిన భామ శ్రద్దా దాస్ అయితే కాలం కలిసి రాలేదు దాంతో వ్యాంప్ పాత్రలు , గెస్ట్ అప్పియరెన్స్ , ఐటెం సాంగ్స్ చేస్తూ నెట్టుకొస్తోంది ఈ భామ. అంతగా ఛాన్స్ లు రాకున్నా హాట్ హాట్ గా ఫోటో షూట్ లు చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ భామ వేశ్య పాత్ర చేయడానికి ముందుకు వచ్చిందట. సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా దాస్ వేశ్యగా కనిపించనుందట.

మాములు పాత్ర ఇస్తేనే అందాలతో వీరంగం వేసే ఈ భామ ఇక వేశ్యగా ఛాన్స్ ఇస్తే ఊరుకుంటుందా రెచ్చిపోదు ! లిప్ లాక్ లతో పాటుగా శృంగార సన్నివేశాలు కూడా చాలానే ఉన్నాయట ఆ సినిమాలో. ఇక ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకత్వం వహించనున్నాడట. ఈభామ ఎన్ని సినిమాల్లో నటించినా అవి హిట్ అయినా శ్రద్దా దాస్ కు మాత్రం కలిసి రావడం లేదు ఎందుకో !