బాలసుబ్రహ్మణ్యం ఇంట తీవ్ర విషాదం

Published on Feb 04,2019 04:44 PM

గాన గంధర్వుడు  బాలసుబ్రహ్మణ్యం ఇంట తీవ్ర విషాదం నెలకొంది . ఎస్పీ బాలు తల్లి శకుంతలమ్మ (89) ఈరోజు ఉదయం నెల్లూరు లో చనిపోయింది . ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సొంతూరు నెల్లూరు కాగా బాలు మాత్రం చెన్నై లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నాడు , అయితే అతడి తల్లిదండ్రులు మాత్రం నెల్లూరు లోనే ఉంటున్నారు . 

తల్లి చనిపోయిన విషయం తెలియడంతో హుటాహుటిన లండన్ నుండి బయలు దేరాడు బాలసుబ్రహ్మణ్యం . ఓ మ్యూజిక్ ప్రోగ్రాం కోసం ఎస్పీబీ లండన్ వెళ్ళాడు . కాగా అదేసమయంలో ఈ సంఘటన జరిగింది . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది శకుంతలమ్మ . ఎస్పీబీ వచ్చాక శకుంతలమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి .