ఘనంగా జరిగిన సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక

Published on Dec 23,2019 09:15 AM

66 వ సౌత్ ఫిలిం ఫేర్ అవార్డుల వేడుక చెన్నై మహానగరంలో అంగరంగ వైభవంగా జరిగింది నిన్న. ఈ వేడుకకు దక్షిణాదిన ఉన్న అన్ని భాషల నటీనటులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక అవార్డులు పొందిన వాళ్లలో రాంచరణ్ , కీర్తి సురేష్ , అనసూయ తదితరులు ఉన్నారు. రంగస్థలం చిత్రంలో ఉత్తమ నటన కనబరిచినందుకు గాను రాంచరణ్ కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. అలాగే మహానటి చిత్రంలో సావిత్రి పాత్రకు జీవం పోసిన కీర్తి సురేష్ కు ఉత్తమ నటి అవార్డు లభించింది. అలాగే మహానటి చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది.

రంగస్థలం చిత్రంలో నటించిన అనసూయ కు ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. అలాగే అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో విలన్ గా నటించిన జగపతి బాబు కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే రష్మిక మందన్న ( గీత గోవిందం ) , దుల్కర్ సల్మాన్ ( మహానటి ) , రత్నవేలు ( రంగస్థలం ) దేవిశ్రీ ప్రసాద్ ( రంగస్థలం ), చంద్రబోస్ ( రంగస్థలం ) , సిద్ శ్రీరామ్ ( గీత గోవిందం ) , శ్రేయా ఘోషల్ ( భాగమతి ) తదితరులు ఉన్నారు.