రెండో పెళ్ళికి సిద్దమైన రజనీకాంత్ కూతురు

Published on Jan 23,2019 03:26 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రెండో పెళ్ళికి సిద్ధమైంది . మొదటి పెళ్లి పెటాకులు కావడంతో 2017 లో విడాకులు తీసుకుంది . ఇక ఇప్పుడేమో రెండో పెళ్ళికి సిద్ధమైంది . ఫిబ్రవరి 11 న రజనీకాంత్ చిన్న కూతురు మళ్ళీ పెళ్లి చేసుకోనుంది . నటుడు , వ్యాపారవేత్త అయిన విశాగన్  వనంగమూడి ని పెళ్లి చేసుకోనుంది సౌందర్య రజనీకాంత్ . 

ఈ పెళ్లి వేడుక మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు . సౌందర్య దర్శకురాలు అన్న విషయం కూడా తెలిసిందే . కొచ్చాడైయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించింది అది ప్లాప్ అయ్యింది , ఆ తర్వాత వి ఐ పి 2 చిత్రానికి దర్శకత్వం వహించింది . ఇది కూడా ప్లాప్ అయ్యింది . మొదటి భర్త అశ్విన్ రాంకుమార్ తో వచ్చిన విభేదాలతో 2017 లో విడాకులు తీసుకుంది . ఇక ఈ రెండో పెళ్లి అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు చేయనున్నారట .