గేయ రచయిత కన్నుమూత

Published on Sep 08,2019 10:34 AM

ప్రముఖ తమిళ గేయ రచయిత ముత్తు విజయన్ శుక్రవారం కన్నుమూశాడు, అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళంలో స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రాలకు అలాగే మొత్తం మీద దాదాపు 800 పాటలను రాసిన ఫేమస్ గేయ రచయిత ముత్తు విజయన్ పచ్చకామెర్ల వ్యాధితో తుది శ్వాస విడిచాడు. జాండీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ వ్యాధి ముదరడంతో కన్నుమూశాడు.
ముత్తు విజయన్ ప్రముఖ కవయిత్రి తేన్ మొళి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి అయ్యాక కొంత కాలానికే ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు రావడంతో విడిపోయారు. ఇక అప్పటి నుండి మానసికంగా కుంగిపోయాడు ముత్తు విజయన్. అదే సమయంలో జాండీస్ అవ్వడంతో అది ప్రాణానికే ముప్పు వాటిల్లింది. కాలేయం బాగా దెబ్బతినడంతో ముత్తు విజయన్ చనిపోయాడు.