దెబ్బతిన్న సాఫ్ట్ వేర్ సుధీర్

Published on Dec 28,2019 05:08 PM

జబర్దస్త్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సుడిగాలి సుధీర్ తాజాగా సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రంతో హీరోగా మారాడు. ఈరోజు ఈ సినిమా విడుదల అయ్యింది అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందలేదు దాంతో సుధీర్ ప్లాప్ ని మూటగట్టుకున్నట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. సుడిగాలి సుధీర్ , ధన్యా బాలకృష్ణ హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్ , గ్లామర్ , యాక్షన్ ఉంది కానీ వాటిని సమపాళ్లలో సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల గట్టి దెబ్బే తగిలింది సుధీర్ కు.

బుల్లితెర పై సంచలనం సృష్టించిన సుధీర్ వెండితెర పై కూడా వెలిగిపోవాలని హీరోగా నటించాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు సుధీర్. అయితే వాటి వల్ల సుధీర్ కు పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది అందుకే హీరోగా ట్రై చేసాడు కానీ ఈ సినిమా ఫలితం తల్లకిందులు అయ్యింది దాంతో హీరోగా ఆశలు ఆవిరి అయినట్లే అని అంటున్నారు. నటుడిగా సుధీర్ కు మంచి మార్కులే పడ్డాయి పైగా డ్యాన్స్ లు , ఫైట్స్ లలో బాగానే అలరించాడు కానీ సినిమా విజయానికి మాత్రం అవి సరిపోలేదు దాంతో ఖంగుతినాల్సి వచ్చింది.