ఈరోజు ఆరు సినిమాల విడుదల

Published on Sep 06,2019 11:25 AM

సాహో హవా తగ్గిపోవడంతో ఈరోజు ఏకంగా 6 సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే ఈ ఆరు సినిమాలు కూడా చిన్నవే కావడంతో వీటిపై పెద్దగా ప్రేక్షకులకు ఆసక్తి లేకుండాపోయింది. పైగా పెద్దగా ప్రచారం కూడా లేదు దాంతో ఈ ఆరు సినిమాలలో ఏవైనా బాగున్నాయని టాక్ వచ్చినా కూడా ఆడటం కష్టమే! ఎందుకంటే చిన్న సినిమాలలో ఏవైనా బాగున్నాయని టాక్ వచ్చేలోపు అవి వెళ్లిపోతున్నాయి మరి.

ఇక ఈరోజు విడుదల అవుతున్న చిత్రాల్లో ఆది సాయికుమార్ నటించిన '' జోడీ '' చిత్రంతో పాటుగా '' ఉండిపోరాదే '' , '' తారామణి '' , '' 2 అవర్స్ లవ్ '' , '' దర్పణం '' , ''వీడు సరైనోడు '' , '' నీకోసం '' చిత్రాలు ఉన్నాయి. ఈ ఆరు చిత్రాలు కూడా అంతగా ప్రభావం చూపించే చిత్రాలు కాకపోవడంతో వీటిపై ఎలాంటి అంచనాలు లేకుండాపోయాయి. ఇక ఈనెల 13 న నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదల కానుంది.