శివాజీరాజా ప్యానెల్ ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారిని కలిశారు

Published on Mar 07,2019 12:57 PM

"మా"ఎలక్షన్స్ పురస్కరించుకుని..ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ  బ్రహ్మానందం గారిని ఈరోజు ఉదయం 11గంటలకు ఆయన స్వగృహంలో.. శ్రీకాంత్,శివాజీరాజా,రఘుబాబు, ఉత్తేజ్,సురేష్ కొండేటి కలిశారు....బ్రహ్మానందం గారు మాట్లాడుతూ.." పేదకళాకారులు, వృద్ద కళాకారులు శివాజీరాజాని వేనోళ్ళ పొగడటం నేను గమనించాను...మా కళాకారుల కోసం తను చేస్తున్న  మంచి పనులే తనని గెల్పిస్తాయని...శివాజీరాజా ప్యానెల్ తప్పనిసరిగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ..నా ఆశీర్వాదాలెప్పుడూ ఉంటాయని.." చెప్పారు...