రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన సింగర్

Published on Jan 30,2019 05:08 PM

ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ శివాని భాటియా(24) చనిపోయింది . పాప్ సింగర్ గా విశేష పేరు ప్రఖ్యాతులు సంపాందించిన సింగర్ శివాని భాటియా . పాప్ సింగర్ గానే కాకుండా బాలీవుడ్ లో పలు చిత్రాలకు పలు సూపర్ హిట్ పాటలను పాడిన శివాని భాటియా ఆగ్రాలో జరుగుతున్న ఫంక్షన్లో హాజరయ్యేందుకు కారులో భర్తతో కలిసి వెళ్తోంది . 

అయితే శివాని ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్తున్న సమయంలో ఓవర్ టేక్ చేసే సమయంలో కారు అదుపు తప్పడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది . కారు అదుపు తప్పడంతో శివాని కి , ఆమె భర్త నిఖిల్ కు గాయాలు అయ్యాయి . అయితే శివాని భాటియా కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ చనిపోయింది .