సింగర్ రాహుల్ బూతుల వీడియో వైరల్

Published on Oct 28,2019 06:12 PM
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పిచ్చ బూతులు తిట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. రాహుల్ బిగ్ బాస్ 3 లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది బిగ్ బాస్ ఇలాంటి సమయంలో రాహుల్ బూతులు తిడుతున్న వీడియో వైరల్ గా మారి రాహుల్ ఇమేజ్ ని దెబ్బతీస్తోంది. పైగా రాహుల్ తిట్టింది ఎవరినో కాదు బిగ్ బాస్ 1 సీజన్ ని అలాగే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని.

రాహుల్ పాడిన మంగమ్మ అనే పాటని బిగ్ బాస్ 1 సీజన్ లో పాల్గొన్న కొంతమంది చులకన చేయడంతో రాహుల్ వాళ్లపై దారుణమైన కామెంట్స్ చేసాడు. అయితే అప్పుడు తిట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనివల్ల రాహుల్ కు ఓట్లు తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.