నటన పై ఆసక్తి చూపుతున్న సింగర్ కౌసల్య

Published on Nov 12,2019 04:10 PM

తెలుగులో పలు చిత్రాల్లో పాటలు పాడిన కౌసల్య కు నటన మీద ఆసక్తి కలుగుతోంది. విభిన్నమైన పాత్రలు వస్తే నటించడానికి అభ్యంతరం లేదని అంటోంది కౌసల్య. తెలుగు లో పలు చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. మంచి సింగర్ గానే కాకుండా తెలుగులో సంగీత నేపథ్యంలో వచ్చిన షోలలో కూడా పాల్గొంది కౌసల్య.

అయితే వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కౌసల్య ప్రస్తుతం తన దృష్టి అంతా నటన మీద పెట్టినట్లు చెప్పకనే చెబుతోంది. రకరకాల గెటప్ లలో ఫోటోలు దిగి వాటిని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. మరి కౌసల్య ఫోటోలను చూసి దర్శక నిర్మాతలు నటనకు అవకాశం ఇస్తారా ? చూడాలి. సింగర్ గా సంచలన విజయాలు అందుకున్న ఈ భామ నటిగా కూడా సంచలన విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.