సింగర్ కనికా కపూర్ పరిస్థితి !

Published on Mar 29,2020 05:37 PM
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పరిస్థితి విషమంగానే ఉంది. ఇప్పటి వరకు మూడుసార్లు కరోనా టెస్ట్ చేయగా మూడుసార్లు కూడా పాజిటివ్ గా తేలడంతో ఆమె కోలుకోవడానికి చాలా సమయమే పట్టేలా ఉందని అంటున్నారు డాక్టర్లు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండటంతో ఆ వ్యాధికి కనికా కపూర్ కూడా బాధితురాలు అయిన విషయం తెలిసిందే. ఫారిన్ వెళ్లొచ్చిన కనికా కపూర్ ఉత్తరప్రదేశ్ లో పెద్ద పార్టీ కూడా ఇచ్చింది. ఆ పార్టీకి రాజకీయ సినీ ప్రముఖులు కూడా వెళ్లారు దాంతో వాళ్లంతా కూడా క్వారంటైన్ లో ఉన్నారు.

కనికా కపూర్ కు మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా మూడుసార్లు కూడా పాజిటివ్ గా తేలడంతో పరిస్థితి ఏంటో అర్ధం కాక సతమతం అవుతున్నారు. ఇక కనికా తో క్లోజ్ గా మూవ్ అయినవాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కరోనా మహమ్మారి భారత్ లో కూడా వికృత రూపం దాల్చింది. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి దాంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.