మాజీ ప్రేయసితో మళ్ళీ శింబు

Published on Mar 07,2019 04:19 PM

హీరోయిన్ లను ప్రేమలోకి దించడం వాళ్లతో ఎంజాయ్ చేయడం పెళ్లి అనే మాట ఎత్తేసరికి తుర్రుమనడం తమిళ వివాదాస్పద హీరో శింబు స్టైల్ . ఇప్పటివరకు పలు అందమైన భామలతో జోరుగా ప్రేమాయణం సాగించిన ప్లే బాయ్ హన్సిక తో కూడా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే . అయితే కొన్నాళ్ల పాటు బాగా కలిసి తిరిగిన ఈ జంట పెళ్లి అనగానే శింబు జంప్ అయిపోయాడు దాంతో శింబు అంటే మండిపోయింది హన్సిక కు . 

కట్ చేస్తే నాలుగేళ్ళ తర్వాత అదే శింబు తో మళ్ళీ నటించడానికి సిద్ధమైపోయింది హన్సిక . తాజాగా ఈ భామ తన 50 వ చిత్రంగా '' మహా '' అనే చిత్రంలో నటిస్తోంది . కాగా ఆచిత్రంలో శింబు అథితి పాత్రలో నటిస్తున్నాడు . అయితే ఈ విషయాన్నీ హన్సిక స్వయంగా వెల్లడించడం విశేషం . అంటే కొన్నాళ్ల క్రితం తనని మోసం చేసిన శింబు పై కోపంగా ఉన్న హన్సిక కు ఇప్పుడా కోపం మాయమై పోయిందేమో ! అందుకే తానే స్వయంగా వెల్లడించింది మాజీ ప్రియుడి గురించి .