సిల్క్ స్మిత చనిపోయే ముందు ఏ హీరోకు ఫోన్ చేసిందంటే

Published on Apr 30,2020 04:46 PM
90 వ దశకంలో దక్షిణ భారతాన్ని ఓ ఊపు ఊపేసిన భామ సిల్క్ స్మిత. తన అందాలతో చెరగని ముద్ర వేసిన సిల్క్ జీవితం విషాదంగా ముగిసింది. కేవలం 36 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకొని సంచలనం సృష్టించింది. అర్దాంతరంగా జీవితాన్ని చాలించే ముందు కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ కు ఫోన్ చేసిందట. అప్పట్లో దక్షిణ భారతదేశంలోని తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషలలో నటించింది సిల్క్ స్మిత.

కన్నడ స్టార్ హీరో అయిన రవిచంద్రన్ కు ఆత్మీయురాలిగా ఉంది సిల్క్. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉండగా పలువురు హీరోలతో ఈ భామకు గొడవలు జరిగాయి. కొంతమంది స్టార్ హీరోలు సిల్క్ స్మిత పొందు కోసం తహతహలాడారు. అయితే అలాంటి వాళ్లకు లొంగలేదు తనకు ఆత్మాభిమానం ఉందని రుజువు చేసింది దాంతో పగబట్టిన కొంతమంది ఆమెకు ఛాన్స్ లు రాకుండా చేసారు. అలాగే సిల్క్ స్మిత కొన్ని సొంత చిత్రాలను నిర్మించి నష్టపోయింది. అలాగే తనని బాగా చూసుకుంటాడు అని ఓ వ్యక్తిని నమ్మితే ఆతడు సిల్క్ స్మిత మొత్తం ఆస్తిని తన గుప్పిట్లో పెట్టుకొని అప్పులు ఆమెకు మిగిల్చాడు. ఆ సమయంలో చనిపోయే ఒకరోజు ముందు అంటే 1996 సెప్టెంబర్  22 న కన్నడ హీరో రవించంద్రన్ కు ఫోన్ చేసిందట. కానీ పని ఒత్తిడిలో ఉన్న రవిచంద్రన్ ఆమె ఫోన్ ని పట్టించుకోలేదు దాంతో ఆ మరుసటి రోజున సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుంది.