అందరి ముందు లిప్ లాక్ చేసిన శ్రియా

Published on Oct 25,2019 04:37 PM

హాట్ భామ శ్రియా శరన్ అందరి ముందు తన భర్త ఆండ్రీ కొశ్చివ్  కు లిప్ లాక్ ఇచ్చి సంచలనం సృష్టించింది. ఇటీవలే ముంబై లో జరిగిన దివాలి వేడుకకు భర్తతో సహా హాజరైంది శ్రియా శరన్. కాగా ఆ వేడుకలలో పాల్గొన్న సమయంలో లిఫ్ట్ దగ్గరకు వెళ్తున్నప్పుడు టక్కున తన భర్తపై విపరీతమైన ప్రేమ వచ్చినట్లుంది అంతే అందరి ముందే అతడి పెదాలను తన పెదవులతో బందించి అధర మధురం అంటే ఏమిటో రుచి చూపించింది.

ఇక భర్త ఆండ్రీ కొశ్చివ్ కూడా తక్కువేమి తినలేదు శ్రియా శరన్ అధరాలను మధురంగా ఆస్వాదించాడు. ఇంకేముంది ఇదే సమయంలో టక్కున తమ కెమెరాలకు పని చెప్పారు ఫోటోగ్రాఫర్లు దాంతో శ్రియా - ఆండ్రీ ల లిప్ లాక్ కెమెరాలలో బందీ అయిపొయింది. ఇప్పుడా లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.