ఈ భామని చాలామంది తిట్టారట

Published on Oct 23,2019 03:23 PM
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో తెలుగునాట తెలుగింటి ఆడపడుచుగా మారిన భామ అవికా గోర్. దాంతో ఈ భామకున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి ఉయ్యాలా జంపాలా అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయం చేసారు . కట్ చేస్తే ఆ సినిమా హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు బాగానే వచ్చాయి అయితే అదే సమయంలో ఈ భామ బాగా లావయ్యింది కూడా . ఇంకేముంది అవికా గోర్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడమే కాకుండా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సినిమాలపై నిరాశతో గుడ్ బై కూడా చెప్పింది కట్ చేస్తే రాజుగారి గది 3 కోసం ఓంకార్ మళ్ళీ అవికా గోర్ ని తీసుకొచ్చాడు. నేను రాజుగారి గది 3 కోసం 12 కిలోల బరువు తగ్గానని అంటోంది అంతేనా తగ్గడానికి కారణం కూడా చెబుతోంది నన్ను చాలామంది లావుగా ఉన్నవని తిట్టారని అందుకే తగ్గానని అంటోంది అవికా గోర్.