ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్న హీరోయిన్

Published on Mar 13,2020 02:40 PM

హీరోయిన్ షీలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది. తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన షీలా కు స్టార్ హీరోల చిత్రాల్లో నటించే ఛాన్స్ అయితే వచ్చింది కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది పాపం. ఎన్టీఆర్ సరసన అదుర్స్ , అల్లు అర్జున్ సరసన పరుగు , రామ్ తో మస్కా చిత్రంలో నటించింది షీలా. తెలుగు , తమిళ ,కన్నడ భాషలతో కలిపి మొత్తంగా 24 సినిమాల్లో నటించింది ఈ హాట్ భామ.

అయితే ఓ స్టార్ ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోనుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అందుకే సినిమాలకు దూరమయ్యింది అని వినిపించింది కట్ చేస్తే చాలా కాలం పాటు సినిమాలలో నటించలేదు కట్ చేస్తే ఇప్పుడు ఎవరికీ చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుంది. సంతోష్ రెడ్డి ని చెన్నై లో పెళ్లి చేసుకుంది షీలా. ఈ పెళ్ళికి సినిమారంగం నుండి ఎవరూ హాజరుకాలేదు ఆహ్వానం అందకపోవడంతో. అయితే తనకు కావాల్సిన వాళ్ళని మాత్రం ఆహ్వానించింది షీలా.