శర్వానంద్ శ్రీకారం ఫస్ట్ లుక్ రేపు విడుదల

Published on Jan 26,2020 04:26 PM

శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం చిత్ర ఫస్ట్ లుక్ రేపు విడుదల కానుంది. కిషోర్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట , గోపి ఆచంట లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '' శ్రీకారం ''. వ్యవసాయంలో వచ్చిన కొత్త పద్ధతులు వాటి వల్ల ప్రయోజనాలు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. పేరుకి సందేశాత్మకంగా సాగే చిత్రం అయినప్పటికీ అన్ని కమర్షియల్ అంశాలను మేళవించి చేస్తున్నారట.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రం శర్వానంద్ కు 29 వ చిత్రం కావడం గమనార్హం. విభిన్న కథా చిత్రాలను చేస్తున్న శర్వానంద్ కు శ్రీకారం పై చాలానే ఆశలు ఉన్నాయట.పడిపడి లేచే మనసు , రణరంగం చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో శ్రీకారంని నమ్ముకున్నాడు శర్వా.