షారుఖ్ ఖాన్ సోదరి మృతి

Published on Jan 29,2020 04:22 PM
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సోదరి నూర్ జెహాన్ (52) మరణించింది దాంతో షారుఖ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నూర్ జెహాన్ షారుఖ్ కు స్వయానా సోదరి కాదు సుమా ! కజిన్ అవుతుంది. నూర్ కుటుంబం పాకిస్థాన్ లో నివాసం ఉంటోంది. నూర్ జెహాన్ కుటుంబం కోసమే షారుఖ్ ఖాన్ పాకిస్థాన్ కు రెండుసార్లు వెళ్ళాడు. గతకొంత కాలంగా నూర్ జెహాన్ నోటి క్యాన్సర్ తో బాధపడుతోంది.

అయితే నోటి క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటోంది నూర్ జెహాన్.  నోటి క్యాన్సర్ వ్యాధి తీవ్రం కావడంతో తుదిశ్వాస విడిచింది. నూర్ జెహాన్ మరణించడంతో షారుఖ్ తో కలిసి నూర్ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు షారుఖ్ అభిమానులు. పాకిస్థాన్ లోని పెషావర్ లో నివసిస్తోంది షారుఖ్ సోదరి నూర్ జెహాన్. ఇక షారుఖ్ విషయానికి వస్తే గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు.