హిట్ కోసం తహతహలాడుతున్న షాలిని పాండే

Published on Oct 30,2019 01:00 PM
అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ గా నటించి సంచలనం సృష్టించిన భామ షాలిని పాండే. అయితే ఆ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు కానీ బోల్డ్ గా నటించిన షాలిని పాండే కు మాత్రం అవకాశాలే లేకుండాపోయాయి పాపం. మహానటి , ఎన్టీఆర్ బయోపిక్ , 118 తదితర చిత్రాల్లో నటించింది కానీ అవి పెద్దగా ఈ భామకు ఉపాయాగపడలేదు పాపం ..... దాంతో కెరీర్ ని అలా అలా నెట్టుకుంటూ వస్తోంది.

తాజాగా ఈ భామ రాజ్ తరుణ్ సరసన నటిస్తోంది, ఆ సినిమాపైనే ఈ భామ ఆశలన్నీ పెట్టుకుంది మరి ఆ సినిమా ఏం చేస్తుందో షాలిని పాండేని. బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత వరుసగా ఛాన్స్ లు వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోతారు కానీ అందుకు విరుద్దంగా షాలిని పాండే కెరీర్ డైలమాలో పడింది పాపం.