సెన్సార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షకీలా

Published on Feb 05,2020 05:01 PM

సెన్సార్ బోర్డు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది షకీలా. మలయాళంలో షకీలా చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అక్కడ షకీలా సినిమా విడుదల అవుతోందంటే అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు కూడా పోటీగా విడుదల చేయడానికి భయపడేవాళ్ళంటే ఈ భామకు ఎంతగా డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే గతకొంత కాలంగా షకీలా సినిమాల్లో నటించడం లేదు. ఆ విషయాన్నీ పక్కన పెడితే ఇన్నాళ్లకు మళ్ళీ '' లేడీస్ నాట్ అలోవ్డ్ '' అనే సినిమా చేసింది.

ఆ సినిమా సెన్సార్ కు వెళ్ళింది, అయితే బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ వాళ్ళు ఇబ్బంది పెడుతుండటంతో షకీలా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాంతీయ సెన్సార్ బోర్డు సెన్సార్ చేయకుంటే సెంట్రల్ సెన్సార్ బోర్డు కు వెళ్తాను . నా సినిమా విడుదల కోసం కోర్టులనైనా ఆశ్రయిస్తాను అని సవాల్ చేస్తోంది షకీలా. సెంట్రల్ బోర్డు కి వెళితే తప్పకుండా కొన్ని కట్స్ తో సెన్సార్ అవ్వడం ఖాయం.