షాకింగ్ :షకీలా బయోపిక్ యూట్యూబ్ లో రిలీజ్

Published on Mar 07,2019 04:33 PM

మలయాళ చిత్ర రంగంలో స్టార్ హీరోలను సైతం గడగడలాడించిన హాట్ భామ షకీలా . అప్పట్లో ఈ భామ నటించిన చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే కుర్రాళ్ళు , ముసలాళ్ళు థియేటర్ ల దగ్గర టికెట్ల కోసం ఎగబడేవాళ్లు , కొట్టుకునే వాళ్ళు దాంతో స్టార్ హీరోల చిత్రాలకు షకీలా స్థాయిలో ఓపెనింగ్స్ లేకుండా పోయాయి . అయితే అంతటి సంచలన వ్యక్తి అయిన షకీలా బయోపిక్ '' శీలవతి '' రూపొందింది . 

అయితే ఆ సినిమాని థియేటర్ లలో రిలీజ్ చేయకుండా యూట్యూబ్ లో రిలీజ్ చేసారు దాంతో అందరూ షాక్ అవుతున్నారు . షకీలా బయోపిక్ ఏంటి ఇలా థియేటర్ లలో కాకుండా యూట్యూబ్ లో రిలీజ్ చేయడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారు . అయితే ఈ సినిమా పూర్తి నిడివి గంటన్నర మాత్రమే ! అలాగే విజువల్ గా అంతగా క్వాలిటీ లేదు దాంతో కాబోలు లేదంటే మరో కారణమో కానీ శీలవతి అనే సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో సందడి చేస్తోంది .