తప్పు చేస్తున్న షకలక శంకర్

Published on Aug 24,2019 11:06 AM

హాయిగా హాస్య నటుడిగా బోలెడు సినిమాలు చేతిలో ఉండేవి షకలక శంకర్ కు కానీ కమెడియన్ గా నటించను అంటూ వస్తున్న అవకాశాలను నిరాకరించి హీరోగా నటించడం మొదలు పెట్టాడు కానీ హీరోగా నటించిన సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతుండటంతో అనవసరంగా కెరీర్ పాడు చేసుకుంటున్నాడు , తప్పు చేస్తున్నాడు అంటూ షకలక శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫిలిం ఇండస్ట్రీ లోని వాళ్ళు . 

జబర్దస్త్ అనే కార్యక్రమంతో వెలుగులోకి వచ్చాడు షకలక శంకర్ . అది ఇచ్చిన ఉత్సాహంతో బోలెడు సినిమాలు వచ్చాయి . అయితే కమెడియన్ గా నటించడం ఇష్టం లేని షకలక శంకర్ హీరోగా మాత్రమే నటిస్తానని మంకు పట్టు పట్టడంతో ఇప్పటి వరకు చేసిన సినిమాలు డిజాస్టర్ లు అయ్యాయి . తాజాగా నిన్న నేనే కేడీ నెంబర్ 1 చిత్రం కూడా డిజాస్టర్ జాబితాలో చేరింది .