విడాకులు తీసుకున్న సీరియల్ నటి

Published on Apr 14,2020 02:07 PM
ఈరోజుల్లో విడాకులు చాలా కామన్ అయిపొయింది. కలిసే ముందు , పెళ్లి చేసుకునే ముందు అలాగే పెళ్లి అయిన కొన్ని రోజుల వరకు ఒకరికొకరు తెగ ప్రేమని ఒలకబోసుకుంటారు. ఆ సమయంలో వాళ్ళ ప్రేమని చూసి ఎవరికైనా కళ్ళు కుట్టాల్సిందే అంతగా ఉంటుంది అతి. కట్ చేస్తే కొన్నాళ్ల కాపురం తర్వాత తీవ్ర విబేధాలు తలెత్తుతాయి దాంతో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోతుంది. ఇప్పటికే లెక్కకుమించిన జంటలు విడాకులు తీసుకోగా తాజాగా ఆ లిస్ట్ లోకి సీరియల్ నటి సిమ్రాన్ ఖన్నా కూడా చేరింది.

స్టార్ ప్లస్ ఛానల్ లో సూపర్ హిట్ అయిన  యే రిష్ తా క్యా కెహ్లతా హై అనే సీరియల్ లో గాయత్రి గోయెంకా పాత్రని పోషించింది నటి సిమ్రాన్ ఖాన్. భరత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ ఒక కొడుకు కూడా కానీ తేడాలు రావడంతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. నా దారి వేరు భరత్ దారి వేరు అందుకే విడాకులు తీసుకున్నాం. విడాకులు తీసుకున్నాం కాబట్టి మేము శత్రువులం కాదు , పరస్పర అవగాహనతోనే విడాకులు తీసుకున్నాం అంటూ వివరణ ఇస్తోంది సిమ్రాన్ ఖన్నా.