ఆర్ ఎక్స్ 100 కు సీక్వెల్

Published on Apr 27,2020 02:30 PM
2018 లో విడుదలై ప్రభంజనం సృష్టించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తున్నాడు ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి. ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత మహాసముద్రం అనే చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసాడు అజయ్ భూపతి అయితే అది సెట్ కాలేదు దాంతో ఆర్ ఎక్స్ 100 సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సీక్వెల్ లో సైతం కార్తికేయ నటించనున్నట్లు ప్రకటించాడు అజయ్ భూపతి.

కాకపోతే ఈ సినిమా ఇప్పుడు కాదు 2021 లో సెట్స్ మీదకు వెళ్తుందట. కార్తికేయ కు ఆర్ ఎక్స్ 100 మంచి లైఫ్ ఇచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత కార్తికేయకు కానీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు కానీ అంతగా సక్సెస్ లు దక్కలేదు. అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఆర్ ఎక్స్ 100 యువతని విపరీతంగా ఆకర్షించింది. అయితే ఆ సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉండదు దాంతో సీక్వెల్ ని మరోలా ప్లాన్ చేస్తున్నాడట అజయ్ భూపతి.