ఆ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందట

Published on Oct 31,2019 10:53 AM
తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం అక్టోబర్ 25 న విడుదలై మంచి విజయాన్ని సాధిస్తోంది దాంతో ఆ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేసాడు హీరో కార్తీ. ఖైదీ విజయవంతమైన నేపథ్యంలో విజయోత్సవ సమావేశాన్ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ఆ చిత్ర బృందం. ఈ వేడుకలో పాల్గొన్న కార్తీ ఖైదీ 2 ప్లాన్ చేస్తున్నామని అయితే ముందుగా ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్తుందని అన్నాడు.

చాలాకాలంగా కార్తీ నటించిన చిత్రాలన్నీ తెలుగులో ప్లాప్ అవుతూనే ఉన్నాయి. అయితే గుడ్డిలో మెల్ల లాగా కాస్త తమిళంలో మాత్రం ఓ మాదిరి హిట్ అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఖైదీ రూపంలో మంచి హిట్ పడటంతో చాలా సంతోషంగా ఉన్నాడు అందుకే ఖైదీ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు.