సంచలన నిర్ణయం వెల్లడించిన విజయ్ దేవరకొండ

Published on Feb 09,2020 02:55 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం వెల్లడించాడు. ఇకపై లవ్ చిత్రాలు చేయనని , యాక్షన్ చిత్రాలు మాత్రమే చేస్తానని ప్రకటించి షాక్ ఇచ్చాడు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రమే నా చివరి ప్రేమకథా చిత్రమని ప్రకటించి సంచలనం సృష్టించాడు. విజయ్ దేవరకొండ ఎదిగింది లవ్ చిత్రాలతోనే అయితే ఇప్పుడు అతడి రేంజ్ అనూహ్యంగా మారిపోయింది కాబట్టి ఇకపై ప్రేమకథా చిత్రాల్లో నటించను అని స్పష్టం చేసాడు. నిన్న వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ ని విడుదల చేసారు ఆ సందర్బంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేసాడు విజయ్ దేవరకొండ.

తాజాగా ఈ హీరో ఫైటర్ అనే యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని హిందీలో కూడా చేస్తున్నారు. తనకు ఊహించని క్రేజ్ రావడంతో ప్రేమకథా చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నాడట ఈహీరో. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈనెల 14 న విడుదల అవుతోంది. నలుగురు భామలు రాశి ఖన్నా , కేథరిన్ ట్రెసా , ఐశ్వర్య రాజేష్ , ఇసా బెల్లె హీరోయిన్ లుగా నటించారు.