సంచలన నిర్ణయం తీసుకున్న దర్శకులు రాజమౌళి

Published on Dec 19,2019 06:03 PM

ఓటమి ఎరుగని దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ రాజమౌళి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా ....... ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆపేయాలని. అవును మీరు వింటున్నది నిజమే ! ఈనెల 25 న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆగిపోనుంది. ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ మీద పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. అయితే ఆ సినిమా షూటింగ్ ని డిసెంబర్ 25 న ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాడు , నిర్ణయం తీసుకోవడమే కాదు ఆ నిర్ణయాన్ని గురించి చెబుతూ ట్వీట్ కూడా చేసాడు జక్కన్న.

ఇంతకీ డిసెంబర్ 25 న ఏముంది ? ఎందుకు షూటింగ్ ఆపాల్సి వస్తోందో తెలుసా ........ ఆరోజు తన అన్నయ్య కీరవాణి కొడుకులు కాలభైరవ సంగీతం అందించగా శ్రీ సింహా హీరోగా నటించిన '' మత్తు వదలరా '' అనే చిత్రం విడుదల అవుతోంది కాబట్టి. దర్శకులు రాజమౌళి కి అన్నయ్య కీరవాణి అంటే ఎనలేని గౌరవం , అభిమానం దాంతో తన అన్న కొడుకులు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న చిత్రం విడుదల అవుతోంది కాబట్టి ఆరోజు ని సెలబ్రేట్ చేసుకోవడానికి గాను ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ క్యాన్సిల్ చేసాడు. మత్తు వదలరా సినిమా చూసి తన అభిప్రాయాన్ని చెప్పనున్నాడు జక్కన్న. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు రాజమౌళి.