సంచలన నిర్ణయం తీసుకున్న సమంత

Published on Feb 07,2020 11:04 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. మరో రెండు మూడేళ్ళలో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పుష్కర కాలంగా హీరోయిన్ గా రాణిస్తున్న సమంత మరో రెండు మూడేళ్ళలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించింది. ఈలోపు యాక్షన్ చిత్రాలతో పాటుగా నెగెటివ్ క్యారెక్టర్ లు కూడా చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నా కెరీర్ లో రకరకాల క్యారెక్టర్ లు చేసానని కానీ ముందు ముందు యాక్షన్ చిత్రాలతో పాటుగా నెగెటివ్ పాత్రలను కూడా పోషించబోతున్నానని స్పష్టం చేసింది.

తాజాగా ఈ భామ జాను అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ఈరోజు విడుదల అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన సమంత ఇకపై భార్యగా , తల్లిగా తనవంతు బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. 2017లో హీరో నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. దాంతో పిల్లల కోసం ఆరాటపడుతున్నట్లు కనబడుతోంది. అందుకే మూడేళ్ళలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట సమంత.