విజయ్ దేవరకొండపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు

Published on Mar 29,2020 05:12 PM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద హీరో విశ్వక్ సేన్. తాజాగా ఈ హీరో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఓ షోకు వెళ్ళాడు. ఆ షోలో యాంకర్ సుమ పలువురు హీరోలను చూపించి వాళ్లకు తగ్గ పదాలను ఇవ్వమని కోరగా విజయ్ దేవరకొండ ఫోటో రాగానే '' యాటిట్యూడ్ '' చూపిస్తాడని చెప్పడం సంచలనంగా మారింది. దాంతో అవాక్కవ్వడం సుమ వంతు అయ్యింది.

అసలే విజయ్ దేవరకొండ ఫాన్స్ కు విశ్వక్ సేన్ కు ఫలక్ నుమా దాస్ చిత్ర విడుదల సమయంలో పెద్ద గొడవలే జరిగాయి. విశ్వక్ సేన్ పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు అప్పటి నుండి. అయితే ఇలాంటి సమయంలో మరోసారి యాటిట్యూడ్ అంటూ విజయ్ దేవరకొండ పై విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే సుమ ఆ తర్వాత ఈ సీరియస్ విషయాన్నీ తేలిక పరచడం ఖాయం కానీ విజయ్ దేవరకొండ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం.