సైరా పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Published on Nov 27,2019 11:56 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసాడు సీనియర్ నటుడు గిరిబాబు. బాహుబలి లాంటి చిత్రాలను ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తారు తప్ప సైరా నరసింహారెడ్డి లాంటి స్వాతంత్య్ర సమరయోధుడి చిత్రాన్ని ఇప్పుడున్న ప్రేక్షకులు చూడరని చిరంజీవి కి చెప్పానని సంచలన వ్యాఖ్యలు చేసాడు గిరిబాబు. 76 ఏళ్ల గిరిబాబు తెలుగులో వందలాది చిత్రాల్లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా నటించాడు. చిరంజీవి కి చాలా సీనియర్ దాంతో గిరిబాబు ని చిరు అన్నయ్యా అని ఆప్యాయంగా పిలుస్తాడు.

దాంతో చిరంజీవి తో తనకున్న చనువుతో ఈ వ్యాఖ్యలు చేసాడు గిరిబాబు. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరు అభినయం అద్భుతం అని ప్రశంసల వర్షం కురిపించాడు గిరిబాబు. మూడు తరాల క్రితం కథ కాబట్టి సైరా ని పెద్ద హిట్ చేయలేకపోయారు ప్రేక్షకులు అదే బాహుబలి లాంటి చిత్రాన్ని మళ్ళీ తీసినా ఈ జనాలు చూస్తారని అంటున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందించిన సైరా మంచి వసూళ్లు సాధించింది కానీ బడ్జెట్ ఎక్కువ కావడంతో కొంతమంది బయ్యర్లు నష్టపోయారు.