చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి

Published on Feb 08,2020 07:06 PM

మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం నంది కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోందని , అయితే ఆ పదవి చిరంజీవికి ఇవ్వొద్దని సంచలన వ్యాఖ్యలు చేసాడు తమ్మారెడ్డి. నంది కమిటీ చైర్మన్ గా చిరుని నియమించడం వల్ల అవార్డులు వచ్చిన వాళ్లకు బాగానే ఉంటుంది కానీ రానివాళ్లు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తారని ఆ గోల చిరంజీవి మెడకు చుట్టుకుంటుందని కాబట్టి ఆ గోల చిరుకు ఎందుకు ? పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు ఈ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుంది అని సలహా ఇస్తున్నాడు తమ్మారెడ్డి.

ఇటీవలే చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపాడు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ దాంతో ఈ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పని పాట లేనివాళ్లకు చైర్మన్ పదవి ఇవ్వాలని సూచించాడు తమ్మారెడ్డి అయితే ప్రస్తుతం పని పాట లేకుండా ఖాళీగా ఉన్నది మాత్రం తమ్మారెడ్డి భరద్వాజ మాత్రమే !