చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత

Published on Apr 25,2020 08:04 AM
క్షణం , ఊపిరి చిత్రాల నిర్మాత పివిపి మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. మీరు ఇంటి పనులు , వంటలు చేసి మా సంసారంలో నిప్పులు పోయొద్దు సార్ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో పనులు చేయడమే కాకుండా తనదైన స్టైల్ లో పెసరట్టు వేసి అమ్మ అంజనాదేవికి  ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ విసిరిన సవాల్ ని స్వీకరించినట్లు చెప్పి పూర్తిచేసిన వీడీయో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తి ఇంటి పనులు చేస్తుంటే మీకేమొచ్చింది మీరు కూడా చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారట మహిళలు. మీరు ఈ పనులు చేయడం వల్ల మాకు కష్టాలు వచ్చాయి సార్ ...... అంటూ ఫన్నీ గా ట్వీట్ చేసాడు నిర్మాత పివిపి. సినిమాలు తీయడమే కాకుండా రాజకీయాల్లోకి కూడా వచ్చాడు ఈ వ్యాపారవేత్త. విజయవాడ పార్లమెంట్ స్థానానికి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసి ఓడిపోయాడు పివిపి. ఓటమి చెందినప్పటికీ విజయవాడ పరిధిలో బాగానే యాక్టివ్ గా తిరుగుతున్నాడు రాజకీయాల్లో.