సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిష

Published on Dec 30,2019 05:37 PM
అందాల భామ త్రిష ఎంత మాట అన్నదో తెలుసా ......... నాకు పెద్దగా లవ్ ఎఫైర్స్ లేవని అనడమే ఈ సంచలనానికి కేంద్ర బిందువు అయ్యింది. 36 ఏళ్ల త్రిష దక్షిణాదిన హీరోయిన్ గా సంచలనం సృష్టించింది. తెలుగు , తమిళ , మలయాళ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో అలాగే తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మొత్తంగా 17 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది ఈ భామ. అయితే తాజాగా ఈ భామ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ నాకు పెద్దగా ఎఫైర్స్ లేవు అని పేర్కొనడం సంచలనంగా మారింది.

ఎందుకంటే 17 ఏళ్ల కెరీర్ లో త్రిష లవ్ ఎఫైర్స్ గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి. పైగా ఓ నిర్మాతని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది కూడా. ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది కట్ చేస్తే ఎక్కడో తేడా కొట్టింది దాంతో ఆ ఎంగేజ్ మెంట్ రద్దు అయ్యింది. ఇటీవలే 96 చిత్రంలో త్రిష నటించగా అది సూపర్ డూపర్ హిట్ అయింది తమిళంలో. దాంతో ఆ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నాడు. ఇందులో త్రిష నటించిన పాత్రలో సమంత నటిస్తోంది.