సంచలన బయోపిక్ జులై 26 న విడుదల

Published on Feb 03,2020 12:08 PM

దక్షిణాదిన సంచలనం సృష్టిస్తున్న బయోపిక్ '' తలైవి ''. ఐరన్ లేడీ గా పేరుగాంచిన జయలలిత బయోపిక్ తలైవి గా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ బయోపిక్ లో  వివాదాస్పద భామ కంగనా రనౌత్ అమ్మ జయలలిత గా నటిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులై 26 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్ గా , రాజకీయ నాయకురాలిగా సంచలనం సృష్టించిన వ్యక్తి , శక్తి జయలలిత అన్న విషయం తెలిసిందే.

తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టించిన జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇక కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన కొన్ని స్టిల్స్ జయలలితని తలపించేలా చేస్తున్నాయి. జయలలిత జీవితం అంటే సంచలనమే ! అలాంటి సంచలన కథనాలతో రూపొందుతున్న ఈ బయోపిక్ తప్పకుండా సంచలన విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని జులై 26 న తెలుగు , తమిళ , హిందీ  భాషలలో విడుదల చేయనున్నారు.