సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి మృతి

Published on Feb 11,2020 04:56 PM

సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు (70) ఈరోజు మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామారావు వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 70 ఏళ్ల వయసులో కూడా సినిమా జర్నలిస్ట్ గా సినిమా రంగానికి ఎనలేని సేవలందించిన వ్యక్తి రామారావు. పసుపులేటి రామారావు అనగానే తెల్లటి వస్త్రాలు భుజాన ఓ సంచితో మూర్తీభవించిన రూపం గుర్తుకు రాక మానదు. తెలుగునాట ఇప్పుడు స్టార్ లుగా వెలుగొందుతున్న ఎందరో పసుపులేటి రామారావుకు అత్యంత సన్నిహితులు.

    ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే పసుపులేటి రామారావుని ఆప్తుడిగా భావిస్తాడు. చిరంజీవి కెరీర్ తొలినాళ్ళలో చిరంజీవి పై అద్భుతమైన ఆర్టికల్ రాసి పాఠకుల మనసు దోచుకోవడమే కాకుండా చిరంజీవికి కూడా ఆప్తుడయ్యాడు. మహామహుల గురించి సుదీర్ఘ వ్యాసాలు రాసిన పసుపులేటి రామారావు అకాల మృతికి యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ నివాళి అర్పిస్తోంది. పసుపులేటి రామారావు మృతి  ఒక్క ఫిలిం జర్నలిస్ట్ కుటుంబానికే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు సైతం  తీరని లోటని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ వినోదం రాంబాబు. పసుపులేటి రామారావు జర్నలిస్ట్ యూనియన్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశాయి.