వెబ్ సిరీస్ లో సీనియర్ హీరోయిన్

Published on Nov 17,2019 10:25 AM

వెండితెర మీద వెలిగిపోతున్న వాళ్ళు అలాగే వెలిగిన వాళ్ళు ఇప్పుడు వెబ్ సిరీస్ లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ఆ కోవలో ఇప్పుడు సీనియర్ హీరోయిన్ మీనా కూడా చేరింది. 90 వ దశకంలో హీరోయిన్ గా తెలుగు , తమిళ , మలయాళ చిత్రాల్లో నటించిన మీనా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నటన మీద గాలి మళ్లినట్లుంది అందుకే మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది.

అయితే తాజాగా '' కారోలిన్ కామాక్షి '' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది మీనా. ఈ భామకు హోమ్లీ ఇమేజ్ ఉంది కానీ ఈ వెబ్ సిరీస్ లో మాత్రం బూతు డైలాగ్స్ ఎక్కువగా మాట్లాడనుందట! తాజాగా ఇచ్చిన హింట్ ప్రకారం మీనా చేత బూతు డైలాగ్స్ ఎక్కువగా చెప్పించారని తెలుస్తోంది. బోల్డ్ గా నటించడం ఇప్పుడు చాలా కామన్ అయిపొయింది కాబట్టి పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేకుండాపోయింది.