భార్యకు సేవ చేస్తున్న సీనియర్ హీరో

Published on Mar 28,2020 04:14 PM
సీనియర్ హీరో మంచు మోహన్ బాబు తన భార్య నిర్మలాదేవి కి సేవలు చేస్తూ కరోనా సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల యావత్ ప్రపంచమే లాక్ డౌన్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో పనులు చేసి అలిసిపోయిన తన భార్య నిర్మలాదేవికి సపర్యలు చేస్తూ మానసిక ప్రశాంతత పొందుతున్నాడు. భర్త సేవలతో తరించిపోయిన నిర్మలాదేవి హాయిగా సేదతీరింది సోఫాలో. ఈ ప్రేమ సన్నివేశాన్ని తన కెమెరాలో బందించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు మంచు మనోజ్.

విలక్షణ నటుడు మోహన్ బాబు తాజాగా ఆకాశం నీ హద్దురా అనే చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు , తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంతో చాలాకాలం తర్వాత మళ్ళీ ప్రేక్షకులను పలకరించనున్నాడు మోహన్ బాబు. కరోనా వైరస్ తో చిన్నా పెద్దా , ధనిక , పేద అనే తేడాలేకుండా భయకంపితులౌతున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే తీరిక దొరకడంతో ఇలా సేవలు చేసుకుంటున్నారు.