బాగానే ఉన్నానంటున్న గౌతమి

Published on Mar 30,2020 11:39 PM
సీనియర్ నటి గౌతమి ఇటీవలే విదేశాలకు చుట్టేసి వచ్చింది దాంతో ఆమె సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంది. గౌతమి ఫారిన్ వెళ్ళొచ్చింది కాబట్టి కరోనా సోకి ఉండచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నాకు ఎలాంటి కరోనా సోకలేదు బాగానే ఉన్నాను కాకపోతే ఫారిన్ వెళ్ళొచ్చాను కాబట్టి గృహ నిర్బంధం లో ఉన్నాను అని స్పష్టం చేసింది. నేను మాత్రమే కాదు మీరు కూడా ఇండ్లలోనే ఉండండి , కరోనా బారి నుండి కాపాడుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తోంది గౌతమి.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన గౌతమి తెలుగులో చాలా చిత్రాల్లోనే నటించింది అయితే తెలుగులో కంటే ఎక్కువగా పాపులర్ అయ్యింది మాత్రం తమిళనాట. తమిళంలో కూడా ఎక్కువ చిత్రాల్లో నటించింది గౌతమి. భర్త నుండి విడిపోయాక హీరో కమల్ హాసన్ తో సహజీవనం చేసింది కొన్నాళ్ళు. అయితే ఆ తర్వాత కమల్ కు గౌతమి కి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇప్పుడు గౌతమి వేరుగా ఉంటోంది చెన్నైలోనే.