సీనియర్ నటుడు కన్నుమూత

Published on Mar 07,2020 01:20 PM

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు జనార్దన్ రావు (74) కన్నుమూశాడు. తెలుగులో 1000 చిత్రాలకు పైగా నటించాడు జనార్దన్ రావు. గుంటూరు జిల్లా పోనిగళ్ల గ్రామంలో జన్మించిన జనార్దన్ రావు సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నై వెళ్ళాడు. తెలుగులో 1000 కి పైగా చిత్రాల్లో నటించాడు కానీ అవి అన్ని కూడా చిన్నవే ! చిన్న పాత్రలే అయినప్పటికీ ఎక్కువ చిత్రాల్లో నటించాడు దాంతో జనార్దన్ రావు ప్రేక్షకులకు సుపరిచితుడే అయ్యాడు.

నిన్న గుండెపోటు తో చెన్నై లోని సాలిగ్రామంలో మరణించాడు జనార్దన్ రావు. తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు వచ్చినప్పటికీ ఈ నటుడు మాత్రం చెన్నై లోనే ఉండిపోయాడు . కొన్ని డబ్బింగ్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు జనార్దన్ రావు. సీనియర్ నటుడు మృతి టాలీవుడ్ లో విషాదం నింపింది. జనార్దన్ రావు తో సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్లు తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు.