సీనయ్య సినిమా ఆగిపోయిందట

Published on Feb 19,2020 02:46 PM
సీనయ్య సినిమా ఆగిపోయిందట

మాస్ దర్శకులు వివివినాయక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా సీనయ్య. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు దర్శకుడు నరసింహారావు. పెద్ద ఎత్తున సీనయ్య చిత్ర ప్రారంభోత్సవం జరిగింది కూడా.  అయితే ఈ సినిమా ఆగిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతో అట్టహాసంగా ఈ సినిమా అయితే ప్రారంభం అయ్యింది కానీ ఎక్కడో తేడా కొట్టినట్లు అందుకే సినిమాని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

కొంత షూటింగ్ కూడా అయ్యింది సీనయ్య చిత్రం. అయితే వచ్చిన ఔట్ పుట్ దిల్ రాజుకు అలాగే వినాయక్ కు ఇద్దరికీ నచ్చలేదట అందుకే ఆ సినిమాని పక్కన పెట్టడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారట. అయితే ఇదే విషయాన్నీ అధికారికంగా చెప్పాల్సి ఉంది కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పాపం ! దర్శకులు వినాయక్ ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున కసరత్తులు చేసి స్లిమ్ అయ్యాడు అలాగే విగ్గు కూడా ప్రత్యేకంగా చేయించుకున్నాడు. ఎంతో కష్టపడితే ఇప్పుడేమో ఇలా అవ్వడం అంటే నిరాశకు గురిచేయడమే !