దేవరకొండ లుంగీ పై సెటైర్లు

Published on Feb 13,2020 11:55 PM

విజయ్ దేవరకొండ కట్టిన లుంగీ పై సెటైర్లు పడుతున్నాయి. నిన్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరుగగా ఆ వేడుకకు విజయ్ వచ్చిన తీరుకి షాక్ అయ్యారు ఎందుకంటే ఫ్యాషన్ పేరుతో లుంగీ కట్టుకొని తలకు టవల్ ( తలపాగా ) చుట్టుకొని వచ్చాడు. ఒక పబ్లిక్ ఫంక్షన్ లో హీరో ఇలా లుంగీ కట్టుకొని తలపాగా చుట్టుకొని రావడం అంటే సంచలనమే ! కానీ ఆపని దేవరకొండ చేయడంతో చాలామంది షాక్ అయ్యారు.

ఇక సోషల్ మీడియాలో దేవరకొండని అభిమానించే వాళ్ళు ఉన్నారు అలాగే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు దాంతో అభిమానించే వాళ్ళు స్టైల్ అంటుండగా వ్యతిరేకించే వాళ్ళు మాత్రం దేవరకొండని ఓ ఆట ఆడుకుంటున్నారు. అయితే తనని ఎంతగా ట్రోల్ చేసినా పట్టించుకోనని ఎందుకంటే ఎంత అభిమానం లేకపోతె ఆ పని చేస్తారు అంటూ పాజిటివ్ గా తీసుకుంటున్నాడు దేవరకొండ. రేపు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదల అవుతోంది మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.