బాలయ్య విగ్గుపై సెటైర్లు

Published on Nov 22,2019 11:02 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా '' రూలర్ '' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం రూలర్ చిత్ర టీజర్  విడుదల చేసారు ఆ చిత్ర బృందం. అయితే ఆ టీజర్ లో బాలకృష్ణ విగ్గు సంచలనం సృష్టిస్తోంది. బాలయ్య పోలీస్ గెటప్ లో ఉన్న విగ్గు ప్రేక్షకులు విస్తు పోయేలా ఉంది దాంతో ఆ విగ్గుపై సోషల్ మీడియాలో బోలెడు సెటైర్లు పడుతున్నాయి. బాలయ్యా .... ఆ విగ్గు ఏందయ్యా అంటూ గగ్గోలు పెడుతున్నారు.

అసలే కొంతమంది బాలయ్య సినిమాపై గెటప్ పై సెటైర్లు వేసే బ్యాచ్ ఉంది ఇలాంటి సమయంలో అటువంటి వాళ్లకు మరింత అవకాశం దొరికింది అనే చెప్పాలి. బాలయ్య విగ్గుపై అలాగే బాలయ్య డైలాగ్స్ పై గెటప్ పై విపరీత ధీరణిలో కామెంట్స్ చేస్తున్నారు బాలయ్య యాంటీ ఫ్యాన్స్. నిజంగానే బాలయ్య పోలీస్ గెటప్ లో ఉన్న విగ్గు అయితే విమర్శలను తెచ్చిపెట్టేలాగే ఉంది. ఈ సినిమా డిసెంబర్ 20 న విడుదల అవుతోంది. మరి అప్పుడు ఎలాంటి విమర్శలు వస్తాయో !