రజనీకాంత్ పై సెటైర్ వేసిన హాస్య నటుడు

Published on Mar 15,2020 02:20 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ పై సెటైర్ వేసి సంచలనం సృష్టించాడు హాస్య నటుడు వడివేలు. రజనీకాంత్ ఎంత ఫేమసో కమెడియన్ గా వడివేలు కూడా అంతే ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అయితే గతకొంత కాలంగా ఈ హాస్య నటుడు సరిగ్గా సినిమాల్లో నటించడం లేదు సరికదా ! పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు కూడా. ఇప్పటికే ఉన్న వివాదాలు సరిపోనట్లుగా తాజాగా రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.


రాజకీయాల్లోకి రావాలని అందరికి ఉంటుందని , అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం చేయడం సినిమావాళ్ళకు కష్టమని తేల్చి పడేసాడు. అంతేకాక రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదని చివరకు రజనీకాంత్ కు కూడా తెలియదని ఎద్దేవా చేసాడు. నాకు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉందని మీరు ఓట్లు వేస్తారా ? చెప్పండి అని మీడియాని ప్రశ్నించాడు వడివేలు. అయితే పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే పరిమితం అవుతాను సీఎం గా వేరేవాళ్లను పెడతాను అన్న రజనీకాంత్ వ్యాఖ్యలను స్వాగతించారు వడివేలు. అంటే ఈలెక్కన రజనీకాంత్ ని సీఎం గా ఒప్పుకోరన్న మాట.