బాలయ్య విగ్గు పై సెటైర్ లు ఆగడం లేదు

Published on Dec 17,2019 03:44 PM

నందమూరి బాలకృష్ణ విగ్గు పై బోలెడు సెటైర్ లు పడుతున్నాయి. తాజాగా ఈ హీరో రూలర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా డిసెంబర్ 20 న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్ లలో కనిపిస్తున్నాడు. ఆ రెండు గెటప్ లలో బాలయ్య విగ్గు పెద్ద కాంట్రవర్సీ జరుగుతోంది. ముఖ్యంగా బాలయ్య పోలీస్ గెటప్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాలయ్య విగ్గు ప్రేక్షకులనే కాదు బాలయ్య అభిమానులను సైతం కలవరపెడుతోంది. ఇక యాంటీ బాలయ్య ఫ్యాన్స్ అయితే మాత్రం వీర లెవల్లో బాలయ్య విగ్గు పై సెటైర్ లు వేస్తున్నారు.

ఇప్పటికే రూలర్ చిత్రంలోని 2 ట్రైలర్ లు విడుదల అయ్యాయి , ఆ రెండు ట్రైలర్ లలో బాలయ్య భారీ డైలాగ్స్ యధావిధిగా చెప్పాడు అయితే పోలీస్ గెటప్ మాత్రం తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. మాస్ మసాలా సినిమాగా రూలర్ రూపొందినట్లు తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే. ఇక ఈ సినిమా పట్ల ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందన్నది ఈనెల 20 న తేలనుంది. మరో మూడు రోజుల్లో రూలర్ భవితవ్యం తేలనుంది. అయితే దాని ఫలితం ఎలా ఉన్నప్పటికీ బాలయ్య విగ్గు మాత్రం విపరీతంగా ట్రోల్ అవుతూనే ఉంది.