అల్లు అర్జున్ పై సెటైర్ వేశాడా ?

Published on Oct 29,2019 04:08 PM

యువ దర్శకులు అనిల్ రావిపూడి హీరో అల్లు అర్జున్ పై సెటైర్ వేసినట్లున్నాడు దాంతో అల్లు అర్జున్ అభిమానులు అనిల్ రావిపూడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ........ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు 2020 జనవరి 12 న విడుదల కాబోతోంది అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో చిత్రం కూడా అదే రోజున విడుదల కానుంది.

అయితే విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నపటికీ అల్లు అర్జున్ తన చిత్రంలోని రెండు పాటలను విడుదల చేసాడు అవి ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో దానిపై సెటైర్ వేసినట్లుగా ఓ వీడియో రూపొందించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి కి విడుదల కాబట్టి ఇప్పుడే ప్రమోషన్స్ ఎందుకు ? అనే డైలాగ్ పేల్చాడు అనిల్ దాంతో అది తప్పకుండా అల్లు అర్జున్ సినిమాపై సెటైర్ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.