ఊరంతా అనుకుంటున్నారు కచ్చితంగా ‘శతమానం భవతి’ లాంటి గొప్పచిత్రం అవుతుంది: మామిడా శ్రీనివాస్‌

Published on Sep 20,2019 04:54 PM

ఊరంతా అనుకుంటున్నారు కచ్చితంగా ‘శతమానం భవతి’ లాంటి గొప్పచిత్రం అవుతుంది: మామిడా శ్రీనివాస్‌
‘‘శతమానం భవతి లాంటి గొప్ప సినిమా తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఆ స్థాయి సినిమా ఏదీ రాలేదు. అందుకే ఇంటిల్లిపాదికీ అలాంటి అద్భుతమైన అనుభూతి కలిగే సినిమాను అందించానే ఉద్దేశంతో ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే సినిమాను ప్రేక్షకు ముందుకు తీసుకురా బోతున్నాం. ఇది కచ్చితంగా ‘శతమానం భవతి’ లాంటి గొప్ప సినిమా అవుతుంది’’ అంటున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ మామిడా శ్రీనివాస్‌. బాలాజీ సాన దర్శకత్వంలో నవీన్‌ విజయక ృష్ణ, అవసరా శ్రీనివాస్‌, మేఘా చౌదరి, సోఫియా సింగ్‌ కీక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. రోవాస్కైర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగు, పి.ఎల్‌.ఎన్‌. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 5న ప్రేక్షకు ముందుకు రానున్న ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను శ్రీరాజేశ్వరి ఫిల్మ్స్‌ బ్యానర్‌, మూవీ మ్యాక్స్‌ అధినేత మామిడా శ్రీనివాస్‌ దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా మామిడా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ‘అపరిచితుడు’, ‘శివపుత్రుడు’ తదితర 20 సినిమాు డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. అలాగే 4 సినిమాు ప్రొడ్యూస్‌ చేశాను. ఆ అనుభవంతోనే ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌ కొన్నాను. ఆ సినిమా చూడగానే ‘శతమానం భవతి’ లాంటి గొప్ప చిత్రం అవుతుందనిపించింది. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. మూవీమ్యాక్స్‌ ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 5న ప్రేక్షకు ముందుకు తీసురాబోతున్నాం. సీనియర్‌ యాక్టర్‌ నరేశ్‌ వాళ్ల అబ్బాయి నవీన్‌ విజయక ృష్ణ ‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ తర్వాత ఇలాంటి మంచి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. కోట శ్రీనివాసరావు, అవసరా శ్రీనివాస్‌, జయసుధ, రావు రమేష్‌, అన్నపూర్ణమ్మ లాంటి పెద్దపెద్ద ఆర్టిస్టు ఈ సినిమాకు పనిచేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది. త్వరలోనే ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించబోతున్నాం. ఒక స్టార్‌ హీరో గెస్ట్‌గా రాబోతున్నారు. ప్రముఖ హీరోతో సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇప్పించబోతున్నాం. ఈ సినిమా వెనుక సూపర్‌స్టార్‌ క ృష్ణ, విజయనిర్మగారి సపోర్ట్‌ ఎంతో ఉంది. ఈ చిత్రాన్ని విజయనిర్మగారికి అంకితం ఇస్తున్నాం’’ అని చెప్పారు.