సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్

Published on Nov 24,2019 12:10 PM

జనవరి 5 న సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న భారీ ఎత్తున విడుదల అవుతున్న నేపథ్యంలో జనవరి 5 న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయనున్నారు. అయితే ఈ వేడుక ఎక్కడ నిర్వహించాలనే దానిమీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో చేయాలా లేక తెలంగాణ లో చేయాలా అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నారట.

సరిలేరు నీకెవ్వరు కర్నూల్ నేపథ్యంలో తెరకెక్కుతోంది కాబట్టి అక్కడ ఈవెంట్ చేయాలనే ఆలోచన అయితే చేస్తున్నారట. త్వరలోనే ఎక్కడ అనేది డిసైడ్ చేయనున్నారు. ఇప్పటికే టీజర్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాడు మహేష్ బాబు. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.