మార్చ్ 7న అమెజాన్ లో సరిలేరు నీకెవ్వరు

Published on Feb 03,2020 06:45 PM

రిలీజ్ అయిన కొత్త సినిమాలను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో నెల రోజుల్లోనే లేకపోతే 50 రోజుల్లోనే స్ట్రీమింగ్ చేయడం కామన్ అయిపొయింది. దాని వల్ల నిర్మాతలకు ఇబ్బందులు వస్తున్నాయి కానీ కొనుక్కున్న వాళ్ళు ఆగరు కదా ! సొమ్ము చేసుకోవాలి కాబట్టి వేడి ఉన్నప్పుడే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో వేసి క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని కూడా అమెజాన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. మార్చ్ 7 న సరిలేరు నీకెవ్వరు అమెజాన్ లో అందుబాటిలోకి రానుంది.

జనవరి 11 న సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల కాగా భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం మూడు వారాలు గడిచినప్పటికీ ఇంకా మంచి వసూళ్లు సాధిస్తూనే ఉంది. ఇక కొన్ని ఏరియాలలో అయితే నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది కూడా. మహేష్ బాబు మేజర్ పాత్రలో నటించగా కీలక పాత్రలో విజయశాంతి నటించింది. ఇక హీరోయిన్ గా రష్మిక మందన్న నటించింది.