సరిలేరు నీకెవ్వరు నుండి మొదటి పాట వస్తోంది

Published on Nov 30,2019 01:39 PM

మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి ఈ సోమవారం రోజున అంటే డిసెంబర్ 2 న మొదటి పాట విడుదల కానుంది. ఇక నుండి ప్రతీ సోమవారం రోజున సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి అప్ డేట్ ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 2 సోమవారం రోజున మొదటి పాట విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్.

మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి , ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 11 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ చిత్రం అల వైకుంఠపురములో పోటీ పడుతోంది.